- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్భాటాలకే పరిమితమైన కొత్త మెనూ..
దిశ, బోథ్ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సంక్షేమ ఎస్టీ, ఎస్సీ, బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని కొత్త మెనూ సైతం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆర్భాటంగా విడుదల చేశారు. రాష్ట్ర మంత్రి సీతక్క చేతుల మీదుగా జిల్లాలో కొత్త మెనూను విడుదల చేశారు. కానీ మండలంలోని సంక్షేమ హాస్టల్లో ఈ కొత్త మెనూ కేవలం గోడలకు తలిగేసిన ఫ్లెక్సీల రూపంలో మాత్రమే ఉందని, ఇప్పటి వరకు ఇది అమలు కావడం లేదన్నారు టీజీవీబీ సంఘం నాయకులు.
మారుమూల ప్రాంతాల్లో ఉన్న హాస్టల్లల్లో కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తలేరని, ఇది కేవలం మాటల ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తిం చేశారు. ఇకనైనా ఇచ్చిన మాట నెరవేర్చాలని, లేని యెడల విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామని రాష్ట్ర టీజీవీపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ కొట్టురి ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కన్వీనర్ గొర్ల నరేందర్, పుల్లంగుల సతీష్, తదితరులు పాల్గొన్నారు.