- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుల్కర్ సల్మాన్‌కు జోడీగా పవన్ కల్యాణ్ హీరోయిన్.. డైరెక్టర్ ఎవరంటే!
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) ‘గ్యాంగ్ లీడర్’(Gang leader) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత డాక్టర్, డాన్, శ్రీకారం, సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram), వంటి చిత్రాలతో హిట్స్ సాధించి క్రేజ్ పెంచుకుంది. ఇటీవల ఆమె కెప్టెన్ మిల్లర్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. అయితే తెలుగులో ఆమె పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) సరసన ‘ఓజీ’(OG) చిత్రం అవకాశం దక్కించుకుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రియాంక మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం.
దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా నటిస్తున్న మలయాళ చిత్రంలో ప్రియాంక హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు నకాష్ హిదాయత్(Naqash Hidayath) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో ఎస్ జే సూర్య(S.J. Surya) కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఈ చిత్రంపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.