కార్మికులకు "సింగరేణి" ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Mahesh |   ( Updated:2024-12-23 07:20:08.0  )
కార్మికులకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Minister Kishan Reddy) సింగరేణి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. "సింగరేణి" ఆవిర్భావ దినోత్సవం("Singareni" Emergence Day) సందర్భంగా ట్వీట్ చేశారు. తన ట్వీట్‌లో.. "తెలంగాణ తల్లి మెడలో నల్లని మణిహారంలా వెలుగొందుతూ, వేలాదిమంది కార్మికులకు ఉపాధిని కల్పిస్తూ, తన వద్దనున్న నల్ల బంగారం తో ప్రజల అవసరాలను తీరుస్తూ.. రాష్ట్ర, దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న "సింగరేణి" ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి కార్మికులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed