‘కొంచెం టచ్‌లో ఉంటే నెక్స్ట్ అప్డేట్ ఇస్తా’.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Kavitha |   ( Updated:2024-12-23 07:31:50.0  )
‘కొంచెం టచ్‌లో ఉంటే నెక్స్ట్ అప్డేట్ ఇస్తా’.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: బుల్లి తెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిన్న చిన్న షోస్‌తో మొదలైన ఈయన కెరీర్.. నేడు సినిమాల్లో హీరోగా నటించే స్థాయికి ఎదిగాడు. ఇక ఈయనకు బాగా ఫేమ్ తెచ్చిపెట్టిన షో అంటే ‘ఢీ’ అనే చెప్పుకోవాలి. అక్కడ సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసే కామెడీకి ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యదేది. ఇప్పటికీ ప్రదీప్ గుర్తుకు రాగానే మన ఫేస్‌లో ఓ చిరునవ్వు వస్తుంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలా యాంకరింగ్‌లో ఓ ఊపు ఊపేసిన ప్రదీప్ కొన్ని నెలలుగా యాంకరింగ్ ఆపేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

అయితే దీనికి కారణం అతను వరుసగా 4 సినిమాలకు సైన్ చేయడమే కారణం. వాటిలో ఒకటి ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఢీ షోలో కో యాక్టర్‌గా చేసిన దీపిక పిల్లి. ఇక ప్రదీప్ మొదటగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే మూవీలో నటించాడు. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద హిట్ అయింది. మరీ ముఖ్యంగా ‘నీలీ నీలీ ఆకాశం ఇద్దామనుకున్నా’ అనే సాంగ్ అయితే అప్పట్లో ఎంత సంచలనం స‌ృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఈ పాట ఇప్పటికీ కుర్రాళ్ల ప్లే లిస్ట్‌లో ఉంటుంది అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో ‘మీరు కొంచెం టచ్‌లో ఉంటే నెక్ట్ అప్డేట్ ఇస్తా’ అని రాసుకొచ్చాడు. అయితే అది చూసిన నెటిజన్లు.. కొంతమంది కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా అనే షో గురించి అని అంటుంటే మరి కొంత మంది మాత్రం తన మూవీ గురించి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రదీప్ పెట్టిన పోస్ట్ దేనికి సంబంధించినదో తెలియాలంటే మరో పోస్ట్ పెట్టే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story