Trump 2.0 Cabinet: ట్రంప్ క్యాబినెట్ లో మరో భారతీయ అమెరికన్ వ్యక్తికి కీలక పదవి..!

by Maddikunta Saikiran |
Trump 2.0 Cabinet: ట్రంప్ క్యాబినెట్ లో మరో భారతీయ అమెరికన్ వ్యక్తికి కీలక పదవి..!
X

దిశ,వెబ్‌డెస్క్: అమెరికా(America)లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కాగా ఇప్పటికే తన పాలకవర్గంలో పలువురు భారత సంతతి వ్యక్తులకు స్థానం కల్పించిన ట్రంప్ తాజాగా.. తన కార్యవర్గంలో మరో భారతీయ అమెరికన్(Indian American) బిజినెస్ మ్యాన్ కు చోటు కల్పించారు. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీరామ్‌ కృష్ణన్‌(Sriram Krishnan)ను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్‌గా నియమించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా 'ట్రూత్(Truth)' వేదికగా అధికారికంగా ప్రకటించారు. వైట్‌హౌస్‌ ఆఫీస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీలో సీనియర్ సలహాదారుగా కృష్ణన్‌ సేవలు అందిస్తారని పోస్టులో తెలిపారు.

కాగా తన నియామకంపై కృష్ణన్‌ 'ఎక్స్(X)' వేదికగా స్పందిస్తూ.. 'ఈ దేశానికి సేవ చేయడం గర్వకారణమని, ఏఐలో అమెరికా నాయకత్వాన్ని కొనసాగించడానికి, డేవిడ్‌ శాక్స్‌(David Sacks)తో కలిసి నేను పని చేస్తానని, ఈ అవకాశం కల్పించినందుకు డొనాల్డ్ ట్రంప్ కు కృతజ్ఞతలు' అని పోస్టులో పేర్కొన్నారు. తమిళనాడు(TN) క్యాపిటల్ సిటీ చెన్నై(Chennai)లో జన్మించిన కృష్ణన్‌ గతంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్ బుక్, స్నాప్ వంటి దిగ్గజ కంపెనీల్లో వర్క్ చేశారు. ఇకపోతే ఇప్పటికే ట్రంప్ వర్గంలో పలువురు భారతీయ అమెరికన్లు కీలక పదవి దక్కింది. డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎఫిషియెన్సీ హెడ్ గా వివేక్ రామస్వామి(Vivek Ramaswamy), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(NIOH) డైరెక్టర్ గా జై భట్టాచార్య(Jai Bhattacharya), ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(FBI) డైరెక్టర్ గా కశ్యప్ పటేల్(Kashyap Patel), పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్ గా హర్మీత్ కె ధిల్లాన్(Harmeet K Dhillon) ట్రంప్ 2.0 క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed