- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమానస్పదంగా ఆంజనేయుని విగ్రహానికి మంటలు.. ?
దిశ, కాటారం : మహాదేవపూర్ మండలంలోని కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ క్షేత్రమైన అమరేశ్వర స్వామి దేవస్థానం ఉపాలయంలో గల ఆంజనేయస్వామి విగ్రహానికి మంటలు లేచాయి. ఈ మంటలలో విగ్రహం కాలిపోయింది. ఆలయ పూజారి నాగరాజు కథనం ప్రకారం గురువారం సాయంత్రం దేవాలయంలో మంటలు లేచినట్లు తెలిపారు ఆ సమయంలో విగ్రహంపై ఎలాంటి వస్త్రము, ఏదో అగ్నికి ప్రభావితమయ్యే ఎలాంటి వస్తువులు లేవని తెలిపారు. అగ్నిప్రమాదం జరిగింది అనే విషయం వెళ్లాల్సి ఉందని ప్రమాదవశాత్తు జరిగిందా లేదా దుండగులు చర్యకు పాల్పడ్డారా అనుమానస్పదంగా ఉందని తెలిపారు.
గురువారం ఆలయంలో గ్రామానికి చెందిన భక్తులు శాంతి పూజ నిర్వహించుకున్నారు. ధనం సమయంలో జరిగిన ఈ సంఘటన ఎలా జరిగిందనేది గ్రామ ప్రజలకు అంతుచిక్కకుండా ఉంది. శుక్రవారం గ్రామ ప్రజలంతా దేవాలయంలో ఈ విషయమై ఆరాధిస్తున్నారు. కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి,మహాదేవపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచందర్ రావు, సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమారులు సంఘటన స్థలాన్ని సందర్శించారు ప్రమాదానికి గల కారణాలు ఆరా తీస్తూ పూర్తిస్థాయిలో కేసు దర్యాప్తు చేస్తామని గ్రామ ప్రజలకు పోలీసులు హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన ఘటనపై స్పష్టత కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని దేవాలయంలో ఇలాంటి ఘటన జరగడం సంచలనంగా మారింది.