రోడ్డు పక్కన ప్రమాదకరంగా బావి

by Naveena |
రోడ్డు పక్కన ప్రమాదకరంగా బావి
X

దిశ,భూదాన్ పోచంపల్లి : భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రం నుంచి జగత్ పల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ప్రమాదకరంగా బావి ఉంది. నిత్యం ఈ దారిగుండా వాహనదారులు, వ్యవసాయ కూలీలు, వివిధ గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రాకపోకలు నిర్వహిస్తుంటారు. ఈ బావి మూలమలుపుపై ఉండడంతో..అటుగా వెళ్లే ప్రయాణికులు బావిలో పడే అవకాశాలు అనేకంగా ఉన్నాయి. రాత్రి వేళలో ఈ దారి వెంట ప్రయాణించాలంటే కత్తి మీద సాము లాంటిదేనని చెప్పొచ్చు. ఈ బావి రోడ్డుకు అతి దగ్గరగా ఉండడంతో..హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణం పోతే కానీ..పట్టించుకోరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు బావిని పూడ్చివేయించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed