Minister Komati Reddy: మేడిగడ్డ తరహాలో బీఆర్ఎస్ సర్కార్ కూలింది.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

by Shiva |
Minister Komati Reddy: మేడిగడ్డ తరహాలో బీఆర్ఎస్ సర్కార్ కూలింది.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మేడిగడ్డ (Medigadda) తరహాలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) సర్కార్ కుప్పకూలిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhongiri District)లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) హయాంలో కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (Nagarjuna Sagar Project) 70 ఏళ్లు గడిచినా నేటికి చెక్కుచెదరకుండా ఉందని అన్నారు. ప్రజా ధనాన్ని లూఠీ చేసి కేసీఆర్ (KCR) తన సొంత ఇంజనీరింగ్‌తో కట్టిన మేడిగడ్డ (Medigadda) ఏడాదికే కూలిందని కామెంట్ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా (Combined Nalgonda District) ఎడారిలా మారిందని ధ్వజమెత్తారు.

తమ జిల్లాకు కేసీఆర్ (KCR) నిధులు మంజూరు చేయకుండా పగబడితే.. ప్రజలకు తిరగబడి ఎమ్మెల్యే (MLA), ఎంపీ (MP) ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీని బొంద పెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బంపర్ మెజారిటీతో గెలిపించారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) చేసిన అప్పులు తీర్చేందుకు సగం డబ్బు పోతోందని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) భవిష్యత్తు పశ్నార్థకమైందని.. అందుకే ఆ పార్టీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆలేరు (Aleru), భువనగిరి (Bhongiri) నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చేందుకు పెండింగ్ ఉన్న మిషన్ భగీరథ (Mission Bhagiratha) పైప్‌లైన్ల పనుల కోసం రూ.210 కోట్లతో పనులు ప్రారంభించామని అన్నారు. ఒకటిన్నర టీఎంసీల కెపాసిటీతో నెలన్నర రోజుల్లో గంధమల్ల రిజర్వాయర్‌ (Gandhamalla Reservoir)ను ప్రారంభిస్తామని అన్నారు. వచ్చేనెల 6న బ్రాహ్మణ వెల్లంల (Brahmin Vellama) ప్రాజెక్టు కెనాల్స్‌ను‌ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story