- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన మార్కెట్ ను నిర్మిస్తాం.. ఉదయ్ కుమార్
దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : కొహెడ లో మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని, అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్ నిర్మాణం చేపడతామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు ఉదయ్ కుమార్ అన్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా అన్ని రకాల సదుపాయాలతో నిర్మాణం ఉంటుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం రెవెన్యూ పరిధిలోని కొహెడ ప్రాంతంలో త్వరలో చేపట్టబోయే నూతన మార్కెట్ స్థలాన్ని ఆయన గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాలకవర్గంతో కలిసి పరిశీలించారు. అనంతరం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకవర్గం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ హబ్ గా ఉండేవిధంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అదేవిధంగా సమీకృత మార్కెట్ కూడా నిర్మిస్తామని అన్నారు.
సమీకృత మార్కెట్ నిర్మాణం ద్వారా మంచి ఎగుమతులు దిగుమతులు జరుగుతాయని అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం ఉంటుందని తెలిపారు. నూతన మార్కెట్ నిర్మాణ డీపీఆర్ ను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫేజ్ - 1 కింద చేపట్టే నిర్మాణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సీఎచ్ బాస్కర చారి, మార్కెట్ డైరెక్టర్లు జైపాల్ రెడ్డి, అంజయ్య, మచ్చేందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, గణేష్ నాయక్, బండి మధుసూదన్ రావు, నవరాజ్, గోవర్ధన్ రెడ్డి, వెంకట్ గుప్తా, ఇబ్రహీంతో పాటు అధికారులు రాష్ట్ర మార్కెటింగ్ అదనపు సంచాలకులు లక్ష్మణుడు, ప్రాంతీయ సంచాలకులు, మల్లేశం, జిల్లా మార్కెటింగ్ అధికారి రియాజ్, ఎస్.ఈ లక్ష్మణ్ గౌడ్, డీఈ రవీందర్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్, మార్కెట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చిలుక నరసింహ రెడ్డి, హర్ష, విజయ్, మురళి ఇతర అధికారులు పాల్గొన్నారు.