కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్.. మ్యారేజ్ అక్కడే అంటూ గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్ తండ్రి..?

by Kavitha |
కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్.. మ్యారేజ్ అక్కడే అంటూ గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్ తండ్రి..?
X

దిశ, సినిమా: ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కీర్తి సురేష్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘నేను లోకల్’, ‘మహానటి’, ‘అజ్ఞాత వాసి’, ‘దసరా’, ‘మిస్ ఇండియా’ వంటి సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నది. ఇక ‘మహానటి’, ‘దసరా’ చిత్రాలైతే ఏకంగా అవార్డులను తెచ్చిపెట్టాయి. అలాగే ఈ భామ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. అయితే తాజాగా కీర్తి సురేష్ వచ్చే నెలలో తన బాయ్ ఫ్రెండ్ అయిన ఆంటోనిని గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యారేజ్ వార్తలపై తాజాగా కీర్తి సురేష్ తండ్రి స్పందించారు.

కీర్తి సురేష్ తండ్రి జి. సురేష్ కుమార్ దీనిపై స్పందిస్తూ.. గోవాలోని ఓ పెద్ద రిస్టార్ట్‌లో ఆంటోని తటిల్, కీర్తి సురేష్‌ల వివాహం జరగబోతుందని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారట. ఇక తండ్రి క్లారిటీతో కీర్తి సురేష్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ బ్యూటీ నిజంగానే పెళ్లాడబోతుందని అందరూ ఓ క్లారిటీకి వచ్చేశారు. కాగా ఈ అమ్మడు మ్యారేజ్ డిసెంబర్ 11 లేదా 12న జరగనున్నట్లు సమాచారం. దీంతో నెటిజన్లు కీర్తి- ఆంటోని ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

Next Story