Buchibabu: ‘ఇట్స్ ఏ బిగ్ డే’.. RC16 పై బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

by Anjali |   ( Updated:2024-11-23 12:52:02.0  )
Buchibabu: ‘ఇట్స్ ఏ బిగ్ డే’.. RC16 పై బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు దక్కించుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram Charan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ధృవ(Dhr̥uva), రంగస్థలం(Raṅgasthalaṁ), ఎవడు(Evaḍu), రచ్చ(Rachha), మగధీర(Magadhira) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్(RRR) చిత్రంతో అయితే ఓవర్ నైట్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం శంకర్(Shankar) దర్శకత్వంలో చరణ్.. ‘గేమ్ ఛేంజర్’(game changer) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ విడుదల కాకముందే గ్లోబల్ స్టార్ కొత్త మూవీలో నటించేందుకు సిద్ధమయ్యాడు. RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక ఉప్పెన(Uppena) సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన డైరెక్టరర్ బుచ్చిబాబు(Director Buchibabu) రామ్ చరణ్ నెక్ట్స్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక కథానాయికగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) మెరవనుంది.

అయితే తాజాగా ఈ డైరెక్టర్ మైసూర్ లో ఉన్న చాముండేశ్వరి మాత(చాముండేశ్వరి Mstha)ను దర్శించుకున్నాడు. అమ్మవారి పాదాల చెంత సినిమా స్టోరీని పెట్టి స్పెషల్ పూజ చేయించినట్లు తెలుస్తోంది. అమ్మవారి ఆశీసులతో RC16 సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు నెట్టింట తెలిపాడు. మైసూర్‌లో 15 డేస్ షూటింగ్ జరుగుతుందని, ఇక్కడ ముఖ్యమైన సీన్స్‌ను షూట్ చేయనున్నామని పోస్ట్ లో వివరించాడు. అనంతరం హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City)లో చిత్రీకరణ ఉంటుందని వెల్లడించాడు. ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Click Here For Twitter Post..

Advertisement

Next Story

Most Viewed