- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Formula E-Race: ‘ఫార్ములా ఈ-రేసు’ కేసులో బిగ్ ట్విస్ట్..! అప్రూవర్‌గా అరవింద్ కుమార్?
తెలంగాణ బ్యూరో: ‘ఫార్ములా ఈ-కారు రేస్’ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అప్రూవర్‌గా మారేందుకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సిద్ధమైనట్టు టాక్. ‘నేను అప్రూవర్‌గా మారుతా.. అన్ని విషయాలు చెబుతాను.. నేను జైలుకు వెళ్ల కుండా చూడాలి.. రాజకీయ ఒత్తిడితోనే రూల్స్‌కు విరుద్ధంగా రూ.55 కోట్లు చెల్లిం చా.’ అని సర్కారుకు రిక్వెస్టులు పంపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ కేసు లో బయటకు రాని విషయాలను సైతం వెల్లడించేందుకు తాను రెడీ అని మధ్యవర్తుల ద్వారా వర్తమానం పంపిస్తున్నట్టు సమాచారం.
త్వరలోనే విచారణ!
‘ఫార్ములా ఈ-కారు రేస్’లో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా, అప్పటి మున్సిపల్ శాఖ సెక్రెటరీ అరవింద్ కుమార్‌ను ఏ2గా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసిన బీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా ఎఫ్ఐఆర్‌లో ఏసీబీ పేర్కొన్నది. త్వరలో కేటీఆర్, అరవింద్ కుమార్‌ను విచారణకు పిలిచేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఈ కేసులో తాను అరెస్ట్ కాకుండా చూడాలని ఐఏఎస్ అధికారి అరవింద్ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్టు సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ నిధులను నిబంధలనకు విరుద్ధంగా ప్రైవేటు కంపెనీకి అప్పగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి.
స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న ఆయన బిజినెస్ రూల్స్‌ను పట్టించుకోకుండా ఆర్థిక శాఖ అనుమతి, కేబినెట్ ఆమోదం లేకుండానే ఫార్ములా ఈ-కారు రేస్ నిర్వాహకులకు రూ.55 కోట్లు చెల్లించారనే అభియోగాలు ఉన్నాయి. దీంతో ఏసీబీ ఏదో ఒకరోజు ఆయనను అరెస్టు చేస్తుందని బ్యూరోక్రాట్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఈ విషయాన్ని గమనించిన అరవింద్.. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు టాక్. ప్రభుత్వంలో కీలక మంత్రులను కలిసి అప్పటి ప్రభుత్వంలోని రాజకీయ నేతల ఒత్తిడి వల్లే రూ.55కోట్లు విడుదల చేశానని, కేసు నుంచి తనను రక్షించాలని ప్రాదేయపడుతున్నట్టు సమాచారం. మరోవైపు ఢిల్లీలోని కాంగ్రెస్ నేతల ద్వారా సైతం లాబీయింగ్ చేస్తున్నారని, అవసరమైతే అప్రూవర్‌గా మారేందుకు రెడీగా ఉన్నానని సంకేతాలు పంపుతున్నట్టు తెలుస్తున్నది.
వెనకున్న వ్యక్తుల పేర్లు సైతం..!
నాటి ప్రభుత్వంలో మున్సిపల్ శాఖలో జరిగిన టెండర్లు, వాటి వెనక ఉన్న సంస్థలు, వ్యక్తుల వివరాలను సైతం వివరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వానికి మధ్యవర్తులు ద్వారా అరవింద్ కుమార్ సంకేతాలు పంపుతున్నట్టు అధికార వర్గాల్లో టాక్. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ ప్రకటించడంతో.. ఆ టెండర్ల వెనక జరిగిన విషయాలనూ ప్రభుత్వానికి వివరిస్తానంటూ అరవింద్ ముందుకు వచ్చినట్టు తెలుస్తున్నది.
రేవంత్‌ను ఇబ్బంది పెట్టిన అరవింద్
బీఆర్ఎస్ హాయంలో మున్సిపల్ శాఖ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ హోదాల్లో పనిచేసిన అరవింద్ కుమార్ నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని పలు రకాలుగా ఇబ్బంది పెట్టినట్టు కాంగ్రెస్ లీడర్లు ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎత్తున ఆర్థిక ప్రయోజనం కలిగిందని రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ తరుపున రేవంత్ రెడ్డిపై హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. టోల్ టెండర్లలో పాల్గొన్న కంపెనీలు, కోట్ చేసిన రేట్లను బహిరంగ పరచాలని డిమాండ్ చేస్తూ విజ్ఞపన పత్రాన్ని అరవింద్ కుమార్‌కు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సెక్రటేరియట్‌కు వెళ్లగా.. ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. పైగా ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.