నరకప్రాయంగా మారుతున్న ప్రధాన రహదారి

by Mahesh |
నరకప్రాయంగా మారుతున్న ప్రధాన రహదారి
X

దిశ, మాడ్గుల: మాడ్గుల మండలం చంద్రాయన్ పల్లి గ్రామం నుంచి ఆమనగల్ వరకు ఉన్న ప్రధాన రహదారి గుంతల మయంగా మారి తరచూ ప్రమాదాలకు గురవుతున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళలో ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాపోతున్నారు. గత ప్రభుత్వంలో ఇర్విన్ గ్రామం నుంచి చంద్రయాన్ పల్లి గ్రామ వరకు డబుల్ రోడ్డును వేసినప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో గ్రామం నుంచి ఆమనగల్ వరకు సింగిల్ రోడ్డు మాత్రమే ఉందని తెలిపారు.

సింగిల్ రోడ్ సైతం పూర్తిగా గుంతల మయం కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు వారు తెలిపారు. ఈ రోడ్డుపై సంవత్సరం క్రితం ఆటో, ట్రాక్టర్ ఢీకొని నలుగురు వ్యక్తులు మృతి చెందగా.. పలువురు క్షతగాత్రులు అయ్యారని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించి ఈ రోడ్డును డబల్ రోడ్డు గా మార్చి తమ కష్టాలను తొలగించాలని వాహనదారులు, పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.

కోటి రూపాయలు మంజూరు..

మాడ్గుల మండలం చంద్రయాన్ పల్లి గ్రామం నుండి ఆమనగల్లు వర కున్న ప్రధాన రహదారికి కోటి రూపాయలు మంజూరయ్యాయి. రోడ్డు నిర్మాణానికి కోటి రూపాయల తో సాంక్షన్ వచ్చింది. టెండర్ ఓపెన్ కాలేదు. త్వరలోనే టెండర్ ఓపెన్ చేసి రోడ్డు పనులు చేపడతాం.:- రవితేజ, ఆర్ అండ్ బీ ఏఈ

Advertisement

Next Story