PV సింధు రిసెప్షన్‌కు హాజరైన CM రేవంత్

by Gantepaka Srikanth |
PV సింధు రిసెప్షన్‌కు హాజరైన CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి(Indian Badminton Player) పీవీ సింధు(PV Sindhu) రిసెప్షన్ మంగళవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ రిసెప్షన్‌కు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా.. గత ఆదివారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పీవీ సింధు వివాహం అత్యంత వైభవంగా జరిగింది. రెండు కుటుంబాల బంధువులతో పాటు కొద్దిమంది అతిథుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా, పీవీ సింధు వివాహం చేసుకున్న వెంకట్ దత్త సాయి బడా వ్యాపారవేత్త కావడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed