- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దురాశకు పోయి సైబర్ క్రైమినల్ కు చిక్కిన యువకుడు..
దిశ, మాచారెడ్డి : సైబర్ నేరాల పట్ల ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలకు ఎంత అవగాహన కల్పించినా మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరాలకు గురికావద్దని హెచ్చరిస్తున్న రింగ్టోన్ సైతం తమ ఫోన్లో అప్రమత్తం చేసినప్పటికీ ప్రజలు దురాశకు లోనై ఆర్థిక నష్టాలకు గురవుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చలో చిక్కి ఏకంగా రెండు లక్షల 75 వేల 500 రూపాయలు పోగొట్టుకున్న ఘటన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది.
ఈ నెల 18న భూక్య సంతోష్ అనే వ్యక్తి ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఫేస్బుక్ ఓపెన్ చేశాడు. ఒక అకౌంట్ నుండి మీకు గిఫ్ట్ పార్సిల్ వచ్చిందని ఇంగ్లాండ్ దేశానికి చెందిన 16,000 పౌండ్స్ పంపిస్తున్నామని నమ్మబలికి వివిధ దశలవారీగా 2,75,500/- రూపాయలను సంతోష్ దగ్గర నుండి కొల్లగొట్టాడు. ఉన్నదంతా ఊడ్చి ఇచ్చిన తర్వాత తను మోసపోయానని గ్రహించిన సంతోష్ సైబర్ క్రైమ్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. అనంతరం మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు.