అంబులెన్స్ లో మహిళ ప్రసవం.. తల్లి,బిడ్డ క్షేమం

by Naveena |
అంబులెన్స్ లో మహిళ ప్రసవం.. తల్లి,బిడ్డ క్షేమం
X

దిశ, హన్వాడ : పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 వాహన సిబ్బంది ఈ ఎమ్ టి మహబూబ్ పాషా,పైలట్ శివశంకర్ ఆశా కార్యకర్త కళావతి ఆమెకు ప్రసవం చేశారు. వివరాల్లోకి వెళితే..హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన నాగలక్ష్మికి బుధవారం ఉదయం 8 గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో..భర్త శివకుమార్ 108 అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. 108 సిబ్బంది ఈఎమ్ టి మెహబూబ్ బాషా, పైలట్ శివశంకర్ టంకర గ్రామానికి చేరుకొని నాగలక్ష్మీని ఆస్పత్రికి తీసుకొని వెళ్తుండగా..మార్గ మధ్యలో నొప్పులు ఎక్కువ అయ్యి అంబులెన్స్ లొనే ప్రసవించింది. నాగలక్ష్మి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వారిని హన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించామని 108 సిబ్బంది తెలిపారు. సకాలంలో స్పందించి కాన్పు చేసిన సిబ్బందిని పలువురు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed