Minister Savitha: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్.. మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-12-25 16:06:01.0  )
Minister Savitha: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్.. మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల్లో 34 శాతం వర్తింపజేయనున్నట్లు మంత్రి సవిత (Minister Savitha) తెలిపారు. ఇవాళ ఆమె టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు అధికారంలో వైసీపీ (YCP) రాష్ట్రంలో దారుణాలకు తెగబడిందని ఆరోపించారు. ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. రాబోయే జనవరిలో సీడాప్, బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో 10 వేల మందిని వ్యాపారవేత్తలను తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. కాపు సంఘం భవనాల నిర్మాణానికి రూ.5.41 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రీ, ప్రోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి రూ.254.48 కోట్లు చెల్లింపులు చేస్తున్నామని పేర్కొన్నారు. 104 బీసీ హాస్టళ్లలో ఎస్సార్ శంకరన్ రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి సవిత స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed