- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాదంలో నాలా నిర్మాణం..
దిశ, బోథ్ : మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లే దారిలో భారీ నాల నిర్మాణం చేపడుతున్నారు. అక్రమంగా చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణాన్ని తొలగించాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మెరుగు నరసింహ దాస్ మంగళవారం స్థానిక ఎంపీడీవో రమేష్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మెరుగు నరసింహ దాస్ మాట్లాడుతూ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేస్తున్నారని, ఇట్టి నిర్మాణం కేవలం కాలువ దారి మళ్లింపు కొరకే జరిగిందని కొంతమంది వ్యక్తులకే మేలు చేయడానికి జరిపారని ఆరోపించారు.
మురికి కాలువ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి వివాదాస్పదంగా మారింది. ఈ నాలా నిర్మాణం గురించి ఒక అధికార పార్టీ నాయకుడికి, గ్రామపంచాయతీ ఈఓకి తీవ్ర వాగ్వాదం జరిగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకునేంత వరకు వెళ్ళింది. ఒక కాలనీలో అస్తవ్యస్తంగా మురుగునీరు పారుతున్నా అక్కడ నాలాల నిర్మాణాలు చేపట్టక ఇక్కడే భారీ మొత్తంలో నిర్మాణం ఎందుకు చేపడుతున్నారని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ ఈవో అంజయ్యను వివరణ కోరగా నూతన కల్వర్టు నుండి అభివృద్ధిలో భాగంగా ఈ నాల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు.