- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Assembly : పీఏసీ చైర్మన్ ఎన్నికను బాయ్ కాట్ చేసిన వైసీపీ
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి (AP Assembly) కమిటీల్లో సభ్యుల ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ప్రజాపద్దులు (PAC), అంచనాలు, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ)ల్లో సభ్యుల నియామకం కోసం ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికలను వైసీపీ బాయ్ కాట్ చేసి నిరసన వ్యక్తం చేసింది. సాంప్రదాయంగా ప్రతిపక్షానికి కేటాయించాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని సంఖ్యాబలంతో అధికార పక్షమే దక్కించుకునే కుట్రతో ప్రభుత్వం ఎన్నిక నిర్వహిస్తుందంటూ వైసీసీ ఆరోపించింది. ఓటింగ్ కొనసాగుతుండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొన్నారు. అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18. కేవలం 11 మంది సభ్యుల సంఖ్యాబలంతో మూడు కమిటీలకూ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో 9కి గాను మొత్తం 10చొప్పున నామినేషన్లు దాఖలవ్వడంతో పోలింగ్ అనివార్యమైంది. కూటమి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటంతో ఈ ఎన్నికలో వారి గెలుపు లాంఛనమే. దీంతో చైర్మన్లుగా పీఏసీకి పులపర్తి ఆంజనేయులు (జనసేన), అంచనాల కమిటీకి వేగుళ్ల జోగేశ్వర రావు (టీడీపీ), పీయూసీకి కూన రవికుమార్ (టీడీపీ) ఎన్నిక కానున్నారు.
పీఏసీ ఎన్నికను బహిష్కరించిన అనంతరం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పడు కాదు 1960 నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్రంలోనూ పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇవ్వడం జరుగుతుందన్నారు. పీఏసీ పదవి అనేది అలంకరణ కోసం కాదని, ప్రభుత్వ పద్దులపై పారదర్శకత, జవాబుదారి తనాన్ని చాటేందుకు రాజ్యంగ స్ఫూర్తిని గౌరవిస్తూ సంఖ్యాబలంతో పని లేకుండా ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇప్పడు కూటమి ప్రభుత్వం ఏదో కొత్త పద్ధతిని తీసుకొచ్చిందని, ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందనే అంశాన్ని ప్రజలకు తెలియచెప్పేందుకే మేము నామినేషన్ వేశామని, ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు.