- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్.. ధోనీ కుమార్తే రియాక్షన్ చూశారా..? వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: చంద్రయాన్-3 మిషన్‌ను ఇస్రో విజయవంతంగా ముగించింది. చందమామ దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. ప్రముఖ క్రికెటర్లు చంద్రయాన్ విజయానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చంద్రయాన్ మిషన్ ప్రోగ్రెస్‌ను టీవీలో చూసిన ధోనీ.. సహచరులతో కలిసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఈ వీడియోలో ట్యాంక్ టాప్, షార్ట్స్ వేసుకొని ఉన్న ధోనీ.. చంద్రయాన్ విజయాన్ని ఆనందించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ధోనీని అందుకే కెప్టెన్ కూల్ అని పిలుస్తారని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఇన్‌స్టా హ్యాండిల్లో మరో వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ధోనీ కుమార్తె జీవా ధోనీ కూడా చంద్రయాన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించింది. టీవీలో ఆ వార్త చూస్తూ ఆమె సంతోషంతో ఎగిరి గంతులు వేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
MS Dhoni daughter Ziva's reaction when Chandrayaan 3 landed on the moon. pic.twitter.com/PIrk9B8Mv9
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2023
MS Dhoni celebrating the success of Chandrayaan 3.
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2023
Video of the day! pic.twitter.com/3YdPpOzLx4