Allu Arjun: ఫ్యాన్స్‌కి ఇక పండగే.. పుష్ప మాస్ ఎంట్రీకి కౌంట్ డౌన్ స్టార్ట్..

by Prasanna |   ( Updated:2024-10-17 07:34:09.0  )
Allu Arjun: ఫ్యాన్స్‌కి ఇక పండగే.. పుష్ప మాస్ ఎంట్రీకి కౌంట్ డౌన్ స్టార్ట్..
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు, ఈ సినిమాకి సీక్వెల్ గా 'పుష్ప2' రాబోతుంది. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ భారీ అంచనాలు ఉన్నాయి.

ఫస్ట్ పార్ట్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్లు, గ్లింప్స్, పాటకు మంచి స్పందన వచ్చింది. అయితే, ఓ వైపు బన్నీ అప్డేట్ లతో ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నా.. ఇంకో వైపు మూవీ రిలీజ్ కి సంబంధించిన వార్తలకి నిరాశ చెందుతున్నారు. ఎందుకంటే ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. ముందుగా ఈ సినిమాని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు తెలిపిన మేకర్స్.. ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ చేసారు.

అయితే, ఫైనల్ గా ఈ మూవీ డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగానే ఈ మూవీ ఇంకా ప్రేక్షకుల ముందుకు రావడానికి 50 రోజులు మాత్రమే ఉందని మూవీ మేకర్స్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఐకాన్ స్టార్ స్టైల్ ఒక రేంజ్ లో ఉందనే చెప్పుకోవాలి. కుర్చీపై కూర్చుని ఉన్న అల్లు అర్జున్ లుక్ ను చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

Next Story