Bihar: బిహార్ లో దారుణం.. కల్తీమద్యం తాగి 20 మంది మృతి

by Shamantha N |
Bihar: బిహార్ లో దారుణం.. కల్తీమద్యం తాగి 20 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మద్య నిషేధం ఉన్న బిహార్(Bihar) లో దారుణం జరిగింది. కల్తీ మద్యానికి 20 మంది బలయ్యారు. సివాన్‌, సారణ్ జిల్లాల్లో ఈ కల్తీ మద్యం కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 20కి పెరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సివాన్ ఎస్పీ అమితేశ్ కుమార్ వెల్లడించారు. మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కల్తీ మద్యం విక్రయాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ పంచాయతీ బీట్‌ పోలీసు అధికారులను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.

కల్తీమద్యానికి బలి

అక్టోబరు 15న సివాన్‌, సారణ్‌ జిల్లాలకు చెందిన పలువురు కల్తీ మద్యం తాగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా.. బిహార్‌ (Bihar)లో మద్యం వినియోగం, విక్రయాలపై 2016 ఏప్రిల్‌లోనే పూర్తిగా నిషేధం విధించింది. అయినప్పటికీ, అక్కడ అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా, అక్కడ కల్తీ మద్యం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Next Story