ఓపెనర్ కాన్వే అవుట్..భారత్ కు ఊరట

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-17 11:31:59.0  )
ఓపెనర్ కాన్వే అవుట్..భారత్ కు ఊరట
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగుళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు సాధించేందుకు మంచి పునాది వేసి సెంచరీ చేసే ఊపులో ఉన్న ఓపెనర్ డెవిడ్ కాన్వే( 91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 105బంతుల్లో 91పరుగులు చేసిన కాన్వే రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ కు ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 40ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 159పరుగులతో కొనసాగుతోంది. క్రీజ్ లో రచీంద్ర 10, మిచెల్ 5పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుతం 113పరుగుల అధిక్యతలో కివీస్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.

కుల్ధీప్ యాదవ్, జడేజా, ఆశ్విన్ లు తలో వికెట్ సాధించారు. కివీస్ బ్యాటర్ యంగ్ 33, ఓపెనర్ టామ్ లాథమ్ 15 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 31.2ఓవర్లలో 46పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యింది.

Advertisement

Next Story