- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలయ్యతో విభేదాలు.. ఎట్టకేలకు అసలు నిజాలు బయటపెట్టిన ఎన్టీఆర్?
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో వారి ప్రవర్తన కూడా అలాగే ఉండటంతో అందరికీ పలు అనుమానాలు తలెత్తాయి. అయితే ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి నాడు నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అక్కడికి తారక్, కళ్యాణ్ రామ్(Kalyan Ram), బాలయ్య వెళ్లి నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఎన్టీఆర్(NTR) ఫొటోలను మాత్రం కొందరు తొలగించేశారు. అది కూడా బాలయ్య చెప్పడం వల్లే జరిగిందనే ప్రచారం జరిగింది.
వీరిద్దరూ దీనిపై రియాక్ట్ అయి క్లారిటీ ఇచ్చినప్పటికీ విభేదాలు కొనసాగుతూనే ఉన్నట్లు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలో.. ఎన్టీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తారక్ బాలయ్యతో విభేదాలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘నాకేంటి అండీ ఆయనతో ప్రాబ్లమ్. నాకు ఏ సమస్యా లేదు. అసలు ప్రాబ్లం ఏంటి అనేది నాకుడా తెలియదు. మా నాన్నగారి బ్రదర్ ఆయన. నాకు తండ్రి లాంటి వారు. ఆయనతో నాకేం గొడవ ఉంటుంది. నేనెందుకు మనసులో పెట్టుకుంటాను. నేను ఏ విషయంలోనైనా ఓపెన్‌గానే ఉంటాను’’ అని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో మరోసారి చక్కర్లు కొడుతున్నాయి.