Sheik hasina: షేక్ హసీనాను అరెస్ట్ చేయండి.. వారెంట్ జారీ చేసిన ఐసీటీ

by vinod kumar |
Sheik hasina: షేక్ హసీనాను అరెస్ట్ చేయండి.. వారెంట్ జారీ చేసిన ఐసీటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు మరో 45 మందిపై బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్(ఐసీటీ) గురువారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నవంబర్ 18లోగా వీరందరినీ అదుపులోకి తీసుకుని తమ ఎదుట హాజరుపర్చాలని జస్టిస్ ఎండీ గోలమ్ మోర్తుజా మజుందార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన హింసా కాండలో మారణహోమం సహా తదితర నేరారోపణలపై హసీనాకు వ్యతిరేకంగా ఐసీటీకి ఫిర్యాదులు అందాయి. దీంతో నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన ఫిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టి ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు చీఫ్ ప్రాసిక్యూటర్ మహ్మద్ తాజుల్ ఇస్లాం వెల్లడించారు. హసీనాతో పాటు అవామీలీగ్ అగ్రనేతలపైనా అరెస్టు వారెంట్ జారీ అయ్యింది.

కాగా, బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఉద్యమంలో భాగంగా భారీ హింస చెలరేగిన విషయం తెలిసిందే. పలు ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో హసీనా ప్రధాని పదవికి రాజీనా చేసి భారత్‌కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ వారెంట్ జారీ చేయడం గమనార్హం. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మొహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది.

Advertisement

Next Story