సివరేజ్ డైవర్షన్ పైప్లైన్ ను ఉపయోగంలోకి తేవాలి

by Sridhar Babu |
సివరేజ్ డైవర్షన్ పైప్లైన్ ను ఉపయోగంలోకి తేవాలి
X

దిశ,ఉప్పల్ : నాచారం పటేల్ కుంట చెరువు వద్ద కోటి 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సివరేజ్ డైవర్షన్ పైప్లైన్ ను ఉపయోగంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశించారు. పైప్లైన్ పనులు పూర్తయినా ఉపయోగంలోకి తీసుకురాకపోవడంతో గురువారం ఆయన నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణతో కలిసి పటేల్ కుంట చెరువును పరిశీలించారు. తక్షణమే సివరాజ్ డైవర్షన్ పైప్లైన్ ను వాడుకలోకి తేవాలని ఆదేశించారు.

అలాగే చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగించేందుకు ఎఫ్టీసీ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎరుకల బస్తీ కాలనీవాసులు చెరువుకు ఆనుకొని నిర్మించుకున్న ఇండ్లు హైడ్రా వల్ల కోల్పోతామని భయపడుతుండటంతో వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సాయి జన్ శేఖర్, ఇరిగేషన్ డీఈ నరేందర్, ఏఈఈ సుధీర్, స్థానికులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story