చేనేత వస్త్రాలను ధరించి అండగా నిలుద్దాం

by Naveena |
చేనేత వస్త్రాలను ధరించి అండగా నిలుద్దాం
X

దిశ, వనపర్తి ప్రతినిధి: వస్త్రాలు,హస్తకళలు శ్రమైక్య జీవన సౌందర్యానికి ప్రతీకలని చెప్ప వచ్చు. వస్త్ర ప్రపంచానికి చేనేత, హస్తకళలు నాణ్యత ప్రమాణాలతో సవాల్ విసురుతున్నాయి. చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరు ధరించి నేతన్నకు అండగా నిలువాల్సిన అవసరం ఉంది. వనపర్తి పట్టణంలోని బ్రహ్మంగారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ బాలజీ చేనేత, హస్తకళల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో.. ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ మేళా పలువురిని ఆకట్టుకుంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేనేత, హస్తకళలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నేతన్న తన చేతితో అద్భుత చిత్ర విచిత్రాలను సృష్టిస్తూ ప్యాషిన్ ప్రపంచానికే వణుకు పుట్టిస్తున్నారు. రకరకాల రంగులద్దిన చేనేత వస్త్రాలు అబ్బర పరుసాతున్నాయి. నేత కళాకారులు వస్త్ర కావ్యాన్ని సృష్టిస్తూ విదేశి వస్త్రాలకు చెక్కు పెట్టే దిశగా ముందుకు సాగుతున్నారు. అగ్గి పెట్టెలో పట్టూ చీరలను మలచిన అద్భుత నైపుణ్యం మన నేతన్న స్వంతం. ఇక్కడి చేనేత చీరలు ఎల్లలు దాటిన ప్రాశస్థ్యం,సంస్థానాదీశుల కాలం నుంచి చేనేత, హస్తకళల కు ఆదారణ ఉండేది. కానీ నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో..చేనేత, హస్తకళలకు కొంత మెరకు ఆదరణ కరువైందనే చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి నాణ్యంగా, ఆకర్షణీయమైన దుస్తులను తయారు చేస్తూ చేనేత కార్మికులు వారే స్వయంగా విక్రయించుంకుంటున్నారు. దేశంలోనే పేరెన్నిక కలిగిన చేనేత, హస్తకళలు కళాకారుల చేతుల్లో ప్రాణాలు పోసుకుని మురిసిపోతున్నాయి. వస్త్రాలు,హస్తకళలను విక్రయించగా వచ్చే కొద్ది పాటి ఆదాయంతో..నేత కళాకారులు కుటుంబాలను పోషించుంకుంటున్నారు. తరతరాలుగా వస్తున్న వృత్తిని వదలకుండా చేనేత కార్మికులు నెట్టుకొస్తున్నారు.ఇప్పుడిప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి మార్కెట్ లో విక్ర యించాలనే ఆలోచనకు పూనుకుందని తెలుస్తోంది. దేశీయ వస్త్రాలను ప్రతి ఒక్కరు ధరించి నేతన్నకు అండగా నిలువాల్సిన అవసరం ఉంది.

వనపర్తి బ్రహ్మం గారి ఆలయంలో చేనేత, హస్తకళల విక్రయాలు

వనపర్తి పట్టణంలో ని బ్రహ్మం గారి ఆలయంలో చేనేత, హస్తకళల ప్రదర్శన, విక్రయాలు భారతి హస్తకళలు, చేనేత కళాకారుల సంఘం ఆధ్వర్యంలో విక్రయిస్తున్నారు. ఈ నెల 17 నుంచి విక్రయిస్తారు. పోచంపల్లి బెడ్ షీట్స్, డ్రస్ మెటీరియల్స్, కళాంకారి శారీష్, ఖాధీ వస్త్రాలు, మంగళ గిరి చేనేత వస్త్రాలు, వరంగల్ టవల్స్, హైదరాబాద్ ఎంబ్రాయిడరీ చీరలు, గద్వాల చీరాల డ్రస్ మెటీరియల్స్, జైపూర్, నారాయణ పేట, సిద్దిపేట, వెంకటగిరి, మంగలగిరి, చేబ్రోలు, పొందేరు, ఉప్రాడ, కంచి, ధర్మవరం చేనేత కాటన్ పట్టు వస్త్రాలు, డ్రస్ మెటీరియల్స్, శారీష్, టవల్స్, వంటి ప్రసిద్ది గాంచిన వస్త్రాలను విక్రయిస్తున్నారు. అదే విధంగా ఆయుర్వేద ఔషధాలు,లెదర్ బ్యాగ్ లు,జూట్ బ్యాగ్ లు, ఇమిటేషన్ జ్యూయలరీ, అలంకణ పుష్పాలు, కొండపల్లి ఏటికొప్పాక బొమ్మ లు అమ్ముతున్నారు. షహరాన్ పూర్ ఉడేన్ లాకర్ వేర్, కళాత్మక ఆభరణాలు, వట్టి వేరు అలంకరణములు తదితర వాటిని విక్రయిస్తున్నారు. ప్రజలు చేనేత, హస్తకళలను కొనుగోలు చేస్తున్నారు.

ప్రభుత్వాలు ఆదరిస్తే అద్భుతాలు సృష్టిస్తాం....

ప్రభుత్వాలు ఆదరిస్తే చేనేత, హస్తకళల తయారిలో అద్భుతాలు సృష్టిస్తాం, కళాకారులమంతా కలసి ఒక సంఘంగా ఏర్పడి వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తు న్నాం. ఉమ్మడి రాష్ట్రంలో 35 చేనేత, హస్తకళల కళాకారుల సంఘాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నాం. వస్త్రాలను, హస్తకళల కోసం మెటీరియల్ కొనుగోలు కోసం ప్రభుత్వాలు రుణాలు ఇచ్చి సబ్సిడీ లు వర్తింప చేస్తే..విదేశి వస్త్రాలకు దీటుగా తయారు చేస్తాం. ప్రస్తుతం చేనేత వస్త్రాలకు ప్రజాదారణ ఉంది.

బాలాజీ హస్తకళా, చేనేత కళాకారుల సంఘం అధ్యక్షులు వెంకట్

Advertisement

Next Story

Most Viewed