Google: గూగుల్ నుంచి మరో సరికొత్త ఫీచర్ లాంచ్.. ఇకపై టాస్క్ మేనేజ్‍మెంట్‍ మరింత ఈజీ..!

by Maddikunta Saikiran |
Google: గూగుల్ నుంచి మరో సరికొత్త ఫీచర్ లాంచ్.. ఇకపై టాస్క్ మేనేజ్‍మెంట్‍ మరింత ఈజీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సెర్చ్ ఇంజిన్(Search Engine) దిగ్గజం గూగుల్(Google) తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను లాంచ్(Launch) చేస్తున్న విషయం తెలిసిందే. ఫేక్ ఫోటోను గుర్తు పట్టేందుకు ఏఐ ఇన్ఫో(AI Info) పేరుతో ఇటీవలే ఓ ఫీచర్‌ను తీసుకురాగా.. తాజాగా వినియోగదారుల కోసం మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే క్యాలెండర్ యాప్(Calendar App)లోని టాస్క్ మేనేజ్‍మెంట్‍(Task Management)ను ఈజీ చేస్తూ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ సాయంతో టాస్కులు క్రియేట్ చేయడం, ఎడిట్ చేయడం వంటివి చేయొచ్చు.

కాగా ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవాలనుకుంటే గూగుల్ క్యాలెండర్ (Google Calendar) హోమ్ స్క్రీన్లో మన ప్రొఫైల్(Profile) పక్కనే చెక్ మార్క్(Check Mark) ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మై టాస్క్స్, ట్రావెల్, న్యూ లిస్ట్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మనం చేయాల్సిన టాస్కులు , కంప్లీటైన టాస్కులు, న్యూ టాస్కుల డీటెయిల్స్ కనిపిస్తాయి. కాగా ప్రస్తుతం ఈ ఫీచర్‌ను గూగుల్ వర్క్ స్పేస్ యూజర్లకు, వ్యక్తిగత కస్టమర్లకు, ఇండివిడ్యువల్ గూగుల్ అకౌంట్లు కలిగిన వారు మాత్రమే యూజ్ చేసుకోవచ్చని తెలిపింది. త్వరలోనే ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed