Federal Bank: కొత్త ఎఫ్‌డీని అందుబాటులోకి తెచ్చిన ఫెడరల్ బ్యాంక్

by S Gopi |
Federal Bank: కొత్త ఎఫ్‌డీని అందుబాటులోకి తెచ్చిన ఫెడరల్ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ కస్టమర్ల నుంచి డిపాజిట్లను ఆకర్షించేందుకు కొత్త ఎఫ్‌డీ కాలవ్యవధిని అందుబాటులోకి తీసుకొచ్చింది. 444 రోజుల కాలవ్యవధిని ప్రవేశపెడుతూ, అత్యధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నట్టు బ్యాంక్ వెల్లడించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, రూ. 3 కోట్ల తక్కువ డిపాజిట్లపై గరిష్ఠంగా 7.50 శాతం వడ్డీ ఇస్తోంది. ఇప్పటివరకు బ్యాంకు 777 రోజుల కాలవ్యవధిపై మాత్రమే అత్యధికంగా 7.40 శాతం వడ్డీని స్తోంది. సీనియర్ సిటిజన్‌లకు అదనంగా 0.50 శాతం ఎక్కువ రాబడి ఉంటుందని బ్యాంకు స్పష్టం చేసింది. ఇక సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై ఏడు రోజుల నుంచి ఐదేళ్ల మధ్య వివిధ కాలవ్యవధులను బట్టి 3-7.5 శాతం మధ్య వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్‌లకు అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీ వర్తిస్తుంది.

Next Story

Most Viewed