- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బుమ్రాను నాతో పోల్చొద్దు : కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, స్పోర్ట్స్ : ఒక తరం ఆటగాడిని మరో తరం ప్లేయర్‌తో పోల్చి చూడొద్దని భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ తెలిపాడు. ఇటీవల మాజీ క్రికెటర్ బల్వీందర్ సంధు.. బుమ్రా పనిభారం గురించి మాట్లాడాడు. బుమ్రా ఇన్నింగ్స్‌లో 15 కంటే ఎక్కువ ఓవర్లు వేయడం లేదని, అప్పట్లో కపిల్ దేవ్ 25-30 ఓవర్లు వేశాడని వ్యాఖ్యానించాడు. దీనిపై తాజాగా కపిల్ దేవ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోమవారం ప్రొఫెషనల్ గోల్ఫ్ టూరు ఆఫ్ ఇండియా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. బుమ్రాను తనతో పోల్చొద్దన్నాడు. రెండు వేర్వేరు తరాల క్రికెటర్లను పోల్చి చూడలేమని చెప్పాడు. ప్రస్తుతం కుర్రాళ్లు ఒకే రోజులో 300 పరుగులు చేస్తున్నారని, ఇది తమ కాలంలో జరగలేదన్నారు. అలాగే, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వార్తలపై స్పందించాడు. వాళ్లిద్దరూ బిగ్ ప్లేయర్స్ అని, సమయం వచ్చినప్పుడే వాళ్లే నిర్ణయం తీసుకుంటారని తెలిపాడు.