- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BRS: దమ్ముంటే రాజీనామ చేయండి.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు రాకేష్ రెడ్డి సవాల్

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అంటేనే కక్ష్యలు, కేసులు, కపట నాటకాలు అని మరోసారి రుజువు అయ్యిందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి(BRS Leader Anugula Rakesh Reddy) అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని(BRS MLA Padi Koushik Reddy) అరెస్ట్(Arrest) చేసే వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధేమో శూన్యం, అక్రమ అరెస్టులు కేసులే ప్రాధాన్యం అనే రీతిలో నడుస్తుందని మండిపడ్డారు. నిన్న కరీంనగర్(Karimnagar) సమావేశంలో మా బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేను అసలు నువ్వు ఏ పార్టీ అని ప్రశ్నిస్తే అక్రమంగా పోలీసులతో దౌర్జన్యంగా బయటకు లాక్కోని వచ్చి, 3 అక్రమ కేసులు పెట్టారని అన్నారు.
కానీ మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తుంటే చేయి చేసుకొని నెట్టిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) ను మాత్రం లాంఛనాలతో మీటింగ్ లో కూర్చో పెట్టిండ్రు అని తెలిపారు. దాడి చేసినోన్ని దండేసి కూసోపెట్టాలే, ప్రశ్నించినోన్ని అక్రమంగా అరెస్టు చేసి బయటకు పంపాలే.. ఇదేనా మీరన్నా ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. అలాగే పార్టీ మారడం, మారకపోవడం ఆ నాయకుడి వ్యక్తిగత విషయం.. కానీ ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకోవడం అనేది ఎన్నుకున్న ప్రజలను మోసం చేయడమే అని, వారిని వశించడమే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రజలు ఓటేసింది సంజయ్ అనే వ్యక్తికి కాదని, బీఆర్ఎస్ పార్టీ గుర్తుకు, కేసీఆర్ అనే నమ్మకానికి అని అన్నారు. నిజంగా దమ్ముంటే పార్టీ మారిన నేతలు రాజీనామ చేసి ఎన్నికల్లో నిలవండి అని రాకేష్ రెడ్డి సవాల్ విసిరారు.