రజతోత్సవ సభకు దండులా కదులుదాం : ఎంపీ వద్దిరాజు

by Kalyani |
రజతోత్సవ సభకు దండులా కదులుదాం : ఎంపీ వద్దిరాజు
X

దిశ, ఇల్లందు: భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి నాయకులు కార్యకర్తలు దండులా కదిలి వచ్చి విజయవంతం చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. మంగళవారం ఐతా ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అధ్యక్షతన నిర్వహించారు. వరంగల్ లో ఈనెల 27వ తేదీన నిర్వహించ తలపెట్టిన పార్టీ 25వ ఆవిర్భావ వేడుకలు అంబురానంటరనున్నాయని, ఈ వేడుకల్లో తెలంగాణ ప్రజానీకం పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచిస్తూ చేతకాని పాలన చేస్తున్నారని, ప్రజలు విస్తు పోయారని రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు వేచి చూస్తున్నారన్నారు.

నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి 500 మంది సభకు తరలివచ్చేలా నాయకులు కృషి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టిన తలోగ్గేది లేదని భవిష్యత్తు బీఆర్ఎస్ దే అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, మహబూబాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, లక్కినేని సురేందర్, పరుచూరి వెంకటేశ్వర్లు, సిలువేరు సత్యనారాయణ, నెమలి ధనలక్ష్మి, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ నాయక్, టేకులపల్లి మండల అధ్యక్షుడు బొమ్మెర వరప్రసాద్, ఇల్లెందు మండల అధ్యక్షుడు శీలం రమేష్, కే. రేణుక, జెకె శ్రీను, కామేపల్లి బయ్యారం మండలాల నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed