YS Jagan: జగన్ కులమతాల పేరుతో రెచ్చగొడుతున్నాడు.. సీఎం చంద్రబాబు మండిపాటు

by Anil Sikha |
YS Jagan: జగన్ కులమతాల పేరుతో రెచ్చగొడుతున్నాడు.. సీఎం చంద్రబాబు మండిపాటు
X

దిశ డైనమిక్ బ్యూరో : కులమతాలను వైయస్ జగన్ రెచ్చగొడుతున్నాడని చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు.ఎస్వీ గోశాల, పాస్టర్ ప్రవీణ్, వక్ఫ్ బిల్లుపై మతాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం వివిధ అంశాలపై ఆయన మంత్రులతో చర్చించారు. జగన్ వైఖరి ఎలా ఉందో కళ్ళ ముందు కనిపిస్తుందని సీఎం అన్నారు. కుట్రలను సమర్ధంగా తిప్పికొడుతూనే ప్రజలను చైతన్య పరచాలని చంద్రబాబు సూచించారు. అధికారుల అవినీతిపై తరచూ చర్చ జరుగుతున్న పై సీఎం ప్రస్తావించారు. రాజకీయంగా అంతా బాగున్న అధికారుల స్థాయిలో ఈ తరహా చర్చలు సరికాదని ఆయన హితవు పలికారు. ఏ శాఖ పరిధిలో మంత్రులు ఆ శాఖ అంశాలపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. బ్యూరోక్రసీలో అవినీతిపై ఈ మధ్య ఎక్కువగా చర్చకు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇన్చార్జి మంత్రుల పర్యటనల్లో మూడు పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలన్నారు. రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం సూచించారు. రెవెన్యూ సమస్యల్లో పోలీసుల జోక్యం అంశాలను పరిష్కరించాలన్నారు. సూర్యకర్ పథకం అమలు మరింత వేగం చేయాలని విషయ నిర్దేశం చేశారు. సీఎంగా నా తొలి ప్రయాణం మొదలు పెట్టినప్పుడు హైదరాబాదు రెండో స్థానంలో ఉన్నట్లు గుర్తుందన్నారు. నేడు హైదరాబాద్ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ నగరంగా ఉందని తెలిపారు. వృద్ధి రేటులో ఏపీ నేడు రెండో స్థానంలో ఉండటం నా ముందు ఉన్న కొత్త సవాలు అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సవాలును అవకాశంగా భావిస్తున్నా.. మరింత కష్టపడి పని చేస్తాను అన్నారు.

Next Story

Most Viewed