- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టెన్త్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని.. విద్యార్థి సూసైడ్

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇవాళ(బుధవారం) పదో తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెన్త్ ఫెయిల్ అయ్యామనో, తక్కువ మార్కులు వచ్చాయనో విద్యార్థులు సూసైడ్ చేసుకొని జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు విడుదలైన పది ఫలితాల్లో పలువురు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించకపోవడంతో తీవ్ర నిర్ణయాలు తీసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి
ఇద్దరు పదో తరగతి విద్యార్థులు సూసైడ్ చేసుకొని తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని కృష్ణా జిల్లా అర్జువానిగూడెంకు చెందిన అనిల్ అనే విద్యార్థి గతేడాది పదో తరగతిలో సైన్స్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో ఆత్మవిశ్వాసంతో మరోసారి ఈ ఏడాది పరీక్ష రాశాడు. కానీ.. ప్రస్తుతం కూడా సైన్స్ పరీక్షలో ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని చనిపోయాడు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక శ్రీకాకుళంలోని బలగ ప్రాంతానికి చెందిన వేణుగోపాలరావు అనే విద్యార్థికి ఇవాళ రిలీజైన టెన్త్ ఫలితాల్లో 393 మార్కులొచ్చాయి. అన్ని సబ్జెక్టులు పాసయ్యాడు. కానీ తక్కువ మార్కులు వచ్చాయని ఉరేసుకొని మృతి చెందాడు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.