- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎమ్మెల్యే పదవీ అడ్డుపెట్టుకుని కౌశిక్ రెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నాడు: ప్రణవ్ బాబు

దిశ, హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన పదవిని అడ్డం పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతు.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు అన్నారు. హుజురాబాద్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఈ నెల 27న జరిగే కేసీఆర్ సభకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ ఇవ్వని వారిని బెదిరిస్తూ అరాచకాలు చేస్తున్నాడని, రాముడి పేరు పెట్టుకున్న కేటిఆర్ వీటిని ప్రోత్సహిస్తున్నారా?.. అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని గ్రానైట్ వ్యాపారి ని బెదిరించిన కౌశిక్ రెడ్డి వ్యాపారి నుంచి ఇప్పటికే చాలా డబ్బులు వసూలు చేశాడని, మళ్లీ డబ్బులు అడిగితే ఇవ్వనందుకు చంపుతానని బెదిరిస్తున్నాడని.. అతని భార్య ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. అలాగే విషయం పై సమగ్ర దర్యాప్తు చేసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని శిక్షించాలని ఈ సందర్భంగా ప్రణవ్ బాబు డిమాండ్ చేశారు.
అలాగే నిత్యం నీతి మాటలు చెప్పే కేటిఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాల పై తన వైఖరేంటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిపితే కౌశిక్ రెడ్డి కి డిపాజిట్ కూడా రాదని అన్నారు. దమ్ముంటే కౌశిక్ రెడ్డి రాజీనామా చేయాలని, అప్పుడు మీరో, మేమో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని అన్నారు. ఎమ్మెల్సీగా హుజురాబాద్‌కు ఏం నిధులు తీసుకొచ్చావని అడిగితే ఇప్పటివరకు సమాధానం లేదని, ఉప ఎన్నికల సమయంలో ఎలాంటి పనులు చేశారో అందరికీ తెలిసిందే అని, ఎమ్మెల్సీగా, ఎమ్మేల్యేగా కౌశిక్ రెడ్డి విఫలమయ్యాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి, కమలాపూర్ మార్కెట్ చైర్మన్ ఝాన్సీ-రవీందర్, హుజురాబాద్ మార్కెట్ చైర్మన్ రాజేశ్వరి-స్వామి రెడ్డి, హుజురాబాద్ పట్టణ,మండల అధ్యక్షులు తిరుపతి, కిరణ్,హనుమాన్ దేవాలయ చైర్మన్ శంకర్, హుజురాబాద్ మండల,పట్టణ మహిళా అధ్యక్షురాలు పుష్పలత,రాధ,నాగమణి,వంశీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.