Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. లక్కీ చాన్స్ కొట్టేసిన బ్యూటీ ఎవరంటే?

by Hamsa |   ( Updated:2025-04-23 11:32:37.0  )
Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. లక్కీ చాన్స్ కొట్టేసిన బ్యూటీ ఎవరంటే?
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇటీవల ‘గేమ్ చేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్‌ను చవిచూశారు. ఇక ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని ‘పెద్ది’(Peddi) కోసం తెగ కష్టపడుతున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్(Shivaraj Kumar) వంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైన విషయం తెలిసిందే.

అయితే RC-17 వర్కింట్ టైటిల్ రాబోతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరు కాంబోలో రాబోతున్న మొదటి సినిమా ఇదే కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్, రష్మిక జంటగా నటిస్తారనే వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు నటించలేదు.ఇక ఇప్పుడు RC-17కోసం జతకట్టబోతున్నట్లు తెలియడంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఇది అసలైన కాంబో అని కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed