RSS: రామమందిర ప్రతిష్టాపన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం.. మోహన్ భగవత్

by vinod kumar |
RSS: రామమందిర ప్రతిష్టాపన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం.. మోహన్ భగవత్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నో శతాబ్దాలుగా భారత్ శత్రు దాడులను ఎదుర్కొంటుందని అయితే రామమందిర ప్రతిష్టాపన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rss) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagavath) అన్నారు. అయోధ్యలోని శ్రీరాముని ఆలయ ప్రతిష్ఠాపన తేదీని ప్రతిష్ఠ ద్వాదశిగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌ (Champath roy)కు ’నేషనల్ దేవి అహల్య అవార్డు’ను సోమవారం ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామమందిరం ఉద్యమం ఎవరినీ వ్యతిరేకించడానికి ప్రారంభించలేదని చెప్పారు. దేశాన్ని మేల్కొల్పడానికే మూమెంట్ చేశామని వెల్లడించారు. గతేడాది అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన సందర్భంగా దేశంలో ఎలాంటి విభేదాలూ జరగలేదని చెప్పారు. ఈ సందర్భంగా చంపత్ రాయ్ మాట్లాడుతూ..రామమందిర ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు తెలిపారు. కాగా, గతేడాది జనవరి 11న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరిగిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed