RGV : పోలీసుల సెర్చింగ్ పై స్పందించిన ఆర్జీవీ లీగల్ టీం

by M.Rajitha |   ( Updated:2024-11-25 15:40:25.0  )
RGV : పోలీసుల సెర్చింగ్ పై స్పందించిన ఆర్జీవీ లీగల్ టీం
X

దిశ, వెబ్ డెస్క్ : డైరెక్టర్ ఆర్జీవీ(RGV) అరెస్ట్ పై సోమవారం ఉదయం నుంచి ఉత్కంఠత కొనసాగుతున్న విషయం తెలిసిందే. వర్మను అరెస్ట్ చేసి ఒంగోలు తీసుకువెళ్లాలని ఈరోజు ఉదయం నుంచి ఆయన డెన్ బయట వేచి చూసిన ఏపీ పోలీసులు(AP Police).. సెర్చ్ వారెంట్ లేకపోవడంతో లోపలికి వెళ్లలేక పోయారు. సాయంత్రం వరకు వేచి చూసిన పోలీసులు.. చివరికి ఆర్జీవీని అరెస్ట్ చేయకుండానే వెనుదిరిగారు. కాగా ఈ వ్యవహారంపై ఆర్జీవీ లీగల్ టీం(RGV Leagal Team) స్పందించింది. ఆయన వ్యక్తిగత విచారణకు హాజరు కాలేడని, వర్చ్యువల్ విచారణకు మాత్రమే హాజరవుతారని ఏపీ పోలీసులకు తెలిపింది. బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం వర్చ్యువల్ గా కూడా హాజరయ్యేందుకు అవకాశం ఉందని, డైరెక్ట్ గా అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం ఎదుర్కొంటామని లీగల్ టీం స్పష్టం చేసింది.

Advertisement

Next Story