- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
LIC: బీమా సఖి స్కీమ్ ప్రారంభించిన నెల రోజుల్లోనే 50 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీ ద్వారా తీసుకొచ్చిన బీమా సఖి యోజనా స్కీమ్‌కు భారీ ఆదరణ లభించింది. గత నెల ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిచిన ఈ స్కీమ్ కోసం నెలరోజుల్లోనే 50,000 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఎల్ఐసీ గురువారం అధికారిక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 9న ప్రారంభమైన స్కీమ్‌లో మొత్తం 52,511 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో 27,695 మందికి అపాయింట్‌మెంట్ లెట్లర్లను జారీ చేశారు. సౌత్ సెంట్రల్ జోన్‌లోనే మొత్తం 12,201 దరఖాస్తులు నమోదు కాగా, 6,284 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేసినట్టు ఎల్ఐసీ హైదరాబాద్ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ తెలిపారు. దాదాపు 3,000 మంది ఏజెంట్లు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల విక్రయం ద్వారా కమీషన్ అందుకున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ పథకంలో చేరి ఎల్‌ఐసీలో మహిళా కెరీర్ ఏజెంట్లుగా పనిచేసే అవకాశం పొందొచ్చన్నారు. 18-70 ఏళ్ల మధ్య వయస్సు, 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు ఎవరైనా ఇందులో చేరవచ్చు. బీమా సఖిగా నియామకం పొందిన మహిళలకు బీమా రంగంలో మూడేళ్ల ట్రెయినింగ్ ఉంటుంది. ట్రెయినింగ్ సమయంలో మొదటి ఏడాది నెలకు రూ.7,000, రెండో ఏడాది రూ.6,000, మూడో ఏట రూ.5,000 చొప్పున వారికి స్టయిఫండ్ వస్తుందని పునీత్ కుమార్ వెల్లడించారు.