- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానుకోటలో కేటీఆర్ గిరిజన ధర్నా చేయడం ఎందుకు…?
దిశ, మహబూబాబాద్ టౌన్ : లగచర్ల పేరుతో మహబూబాబాద్‌లో ధర్నా ఎందుకు..? మహబూబాబాద్‌లో శంకర్‌నాయక్ దౌర్జన్యాలు చేసినప్పుడు ఎక్కడున్నావ్..? అభివృద్ధి పేరుతో 30 మంది గిరిజనుల భూములు నీ ప్రభుత్వం లాక్కోలేదా..? అప్పుడు గిరిజనుల గోడు నీకు వినిపించలేదా..? సోమవారం విలేకరుల సమావేశం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆ భూముల పక్కనే మీ పార్టీ నేతల భూములను మాత్రం ఎందుకు ముట్టుకోలేదు..? అని తెలిపారు.వాళ్లకు లబ్ది చేయడం కోసమే ఎస్టీల భూముల్లో సర్కార్ భవనాలు కట్టారా.. దానికి ముందు సమాధానం చెప్పాలి అన్నారు.
మెడికల్ కాలేజ్‌కోసం గిరిజనుల భూములు లాక్కున్నప్పుడు గిరిజనులు గుర్తులేదాఅని అన్నారు. రవినాయక్‌ను హత్య చేసినప్పుడు మానుకోటకు ఎందుకు రాలేదనిప్రశ్నించారు. “నీ రాజకీయం కోసం గిరిజనులను చేసుకుంటావా, గత ఎన్నికల్లో లంబాడాలు కాంగ్రెస్‌కు మద్దతు పలికినందుకు ఎన్ని కుట్రలు పన్నుతున్నావా.. నీ కుట్రలు ఏమాత్రం ఫలించవు... నీ నైతికత ఉంటే నీ నియోజకవర్గంలోని నేరెళ్లకు వెళ్లు,ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు థర్డ్ డిగ్రీతో వేధించిన దళితుల కాళ్లు కడిగి క్షమాపణ చెప్పు, దళితురాలు మరియమ్మను లాకప్‌డెత్ చేసినప్పుడు నీవెక్కడికి పోయావ్. ఆ రోజు కళ్లు కనిపించలేదా,చెవులు వినిపించలేదా, మల్లన్నసాగర్‌లో రెండు తండాల భూములు ముంచినప్పుడు గిరిజనులు గుర్తు రాలేదా,భూములు ఇవ్వమంటే లాఠీచార్జి చేసినప్పుడు డ్రగ్స్ తీసుకుని సోయిలేకుండా పడుకున్నావా అంటూ ప్రశ్నించారు. ఈ సమావేశంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మాజీ పీసీసీ సభ్యులు దస్రు నాయక్, కౌన్సిలర్లు రాజు, హరి సింగ్, శ్రీను, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, జిల్లా నాయకులు ఎడ్ల రమేష్ , జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.