TRAI: వెబ్‌సైట్‌ లో కవరేజ్ మ్యాప్ తప్పక ఉంచాల్సిందే.. టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-25 16:55:53.0  )
TRAI: వెబ్‌సైట్‌ లో కవరేజ్ మ్యాప్ తప్పక ఉంచాల్సిందే.. టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని టెలికాం కంపెనీల(Telecom companies)కు టెలికాం అధారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక జారీ చేసింది. రెగ్యులర్ సర్వీసులతో పాటు యూజర్లకు అవసరమైన మరో సర్వీసును కూడా ప్రొవైడ్ చేయాలని వాటికి సూచించింది. వైర్ లెస్ టెలికాం సంస్థలు ఇక నుంచి తమ అధికారిక వెబ్‌సైట్‌ లో జియో స్పేషియల్ కవరేజ్ మ్యాప్(Geo Spatial Coverage Map)ను యాడ్ చేయాలని ఆదేశించింది. అంటే ఏయే ప్రాంతాల్లో తమ నెట్‌వర్క్(Network) ఎక్కువగా అందుబాటులో ఉందో ఈ మ్యాప్ లో చూపించాల్సి ఉంటుంది. దీంతో యూజర్లు తాము నివసించే ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ లభిస్తుందో తెలుసుకోవడానికి వీలుంటుందని ట్రాయ్ పేర్కొంది. ఇదేగాక ఏ నెట్‌వర్క్ చూజ్ చేసుకుంటే మెరుగైన కవరేజ్ లభిస్తుందో ఈ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది. అలాగే 2జీ, 3జీ, 4జీ,5జీ సేవలకు సంబంధించి కవరేజ్ వివరాలు కూడా ఇందులో కనిపిస్తాయి. కాగా ఈ కొత్త సర్వీస్ ద్వారా టెలికాం సంస్థల సేవలలో యూనిటీ(Unity), పారదర్శకత్వం(Transparency) మరింత మెరుగవుతుందని ట్రాయ్ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed