ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసిన సర్కార్ మాది.. ఎమ్మెల్యే

by Sumithra |
ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసిన సర్కార్ మాది.. ఎమ్మెల్యే
X

దిశ, కొడిమ్యాల : దేశంలోనే మొట్టమొదటిసారి ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో 73 మందికి కళ్యాణ లక్ష్మి, 180 మంది లబ్ధిదారు లకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితం అని తన చివరి శ్వాస వరకు మీ కుటుంబ సభ్యుడిగా చొప్పదండి నియోజకవర్గనికి సేవ చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమేష్, ఎంపీడీవో స్వరూప, ఫ్యాక్స్ ఛైర్మెన్ రాజనర్సింగరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీపీ స్వర్ణలత నాయకులు నారాయణ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, మల్లేశం, గోల్కొండ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed