- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL: వేలంలో ముగిసిన సన్ రైజర్స్ పర్స్ మనీ.. ఎంతమంది ప్లేయర్లకు కొన్నదంటే..?
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ మెగా వేలం(IPL Mega Auction)లో సన్ రైజర్స్(Sunrisers) పర్స్ వ్యాల్యూ రూ. 50 లక్షలకు చేరుకుంది. దీంతో ఒకే ఒక్క ప్లేయర్‌ను అది కూడా బేస్ ప్రైజ్ కు కొనే అవకాశం మాత్రమే ఉంది. కాగా ఈ మెగా వేలానికి ముందు కీలక ప్లేయర్లను రిటైన్ చేసుకోగా.. కేవలం 45 కోట్ల పర్స్ వ్యాల్యూ తో వేలంలోకి వచ్చింది. ఈ మెగా వేలంలో కూడా కిషన్, షమీ, హర్షల్ పటేల్, అభినవ్ మనోహర్, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్ వంటి కీలక ప్లేయర్లను సొంతం చేసుకుంది. అలాగే ఈ మొత్తం వేలంలో రిటైన్ చేసుకున్న ప్లేయర్లను కాకుండా.. సన్ రైజర్స్ జట్టు 14 మంది ప్లేయర్లను వేలంలో సొంతం చేసుకుంది. మొదటి రోజు కీలక ప్లేయర్లను దక్కించుకున్న SRH.. రెండో రోజు వేలంలో ఆచితూచి.. వ్యవహరించింది. ఈ క్రమంలో వివిధ టోర్నమెంట్లలో రాణించిన ప్లేయర్లపై దృష్టి సారించి తక్కువ ధరకు కీలక ప్లేయర్లను సొంతం చేసుకుంది.
మెగా వేలంలో SRH తీసుకున్న ప్లేయర్లు..
1 ఇషాన్ కిషన్ -₹11,25,00,000 క్యాప్డ్
2 మహ్మద్ షమీ- ₹10,00,00,000 క్యాప్డ్
3 హర్షల్ పటేల్ - ₹8,00,00,000 క్యాప్డ్
4 అభినవ్ మనోహర్ - ₹3,20,00,000 అన్‌క్యాప్డ్
5 రాహుల్ చాహర్- ₹3,20,00,000 క్యాప్డ్
6 ఆడమ్ జంపా - ₹2,40,00,000 క్యాప్డ్
7 సిమర్‌జీత్ సింగ్ - ₹1,50,00,000 అన్‌క్యాప్డ్
8 ఎషాన్ మలింగ- ₹1,20,00,000 అన్‌క్యాప్డ్
9 బ్రైడన్ కార్సే - ₹1,00,00,000 క్యాప్డ్
10 జయదేవ్ ఉనద్కత్- ₹1,00,00,000 క్యాప్డ్
11 కమిందు మెండిస్ - ₹75,00,000 క్యాప్డ్
12 జీషన్ అన్సారీ- ₹40,00,000 అన్‌క్యాప్డ్
13 అనికేత్ వర్మ - ₹30,00,000 అన్‌క్యాప్డ్
14 అథర్వ తైదే- ₹30,00,000 అన్‌క్యాప్డ్
వీరు కాకుండా రిటెన్షన్ లో, పాట్ కమ్మిన్స్, క్లాసిన్, ట్రావిస్ హెడ్, అభిశేక్ శర్మ, నితిష్ కుమార్ రెడ్డిలను తీసుకొగా.. ప్రస్తుతం సృహ పూర్తి జట్టు సంఖ్య 19 కి చేరుకుంది. వీరిలో ఏడుగురు విదేశీ ప్లేయర్లు కాగా మిగిలిన 11 మంది భారతీయ ప్లేయర్లు ఉన్నారు.