- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Groom: పెళ్లి ఊరేగింపులో గందరగోళం.. వరుడు ఏం చేశాడో తెలిస్తే షాకవ్వాల్సిందే?
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్(Utharapradesh) లోని మీరట్(Meerat)లో ఓ పెళ్లి ఊరేగింపులో భాగంగా గందరగోళం నెలకొంది. వివాహ వేడుక వద్దకు వెళ్తున్న వరుడు ఒక్కసారిగా సినిమా హీరోగా మారి సంచలనం సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి కొడుకు తన మెడలో డబ్బుల కట్టలతో చేసిన దండ వేసుకుని వివాహ వేదిక వద్దకు గుర్రంపై ఊరేగింపుగా వెళ్తు్న్నాడు. ఈ క్రమంలో ఆ డబ్బులను గమనించిన ఓ ట్రక్కు డ్రైవర్ అందులోని కొన్ని డబ్బులను తెంపి ఎత్తుకెళ్లాడు. దీనిని గమనించిన పెళ్లి కొడుకు వెంటనే గుర్రంపై నుంచి తన స్నేహితుడి బైక్‌తో ట్రక్కు డ్రైవర్‌ను వెంబడించాడు. ఓ ప్రాంతంలో రోడ్డుపై ట్రక్కు వెళ్తుండగా దానిని గమనించి అమాంతం బైక్ మీద నుంచి ట్రక్కుపై దూకాడు. అనంతరం కిటీకీలోంచి డ్రైవర్ సీటులోకి దూరి దొంగను పట్టుకున్నాడు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న పెళ్లి కొడుకు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి దొంగను పిడి గుద్దులు గుద్దాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుడు జీవితంలో తన పెళ్లిన మర్చిపోలేరని పలువురు కామెంట్స్ చేస్తుండగా, ఒక్కసారిగా సినిమా హీరోగా మారడని మరికొందరు చెబుతున్నారు.