- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నగరంలో బయటపడ్డ మరో ఫ్రీ లాంఛ్ మోసం
దిశ, శేరిలింగంపల్లి : ప్రీ లాంచ్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ఎంఎస్ఆర్ హోమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ చక్క భాస్కర్, డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఆయన భార్య చక్క సుధారాణిలను సోమవారం అరెస్టు చేశారు సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు. ఎంఎస్ఆర్ హోమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ పేరిట హైదర్ నగర్ ఏఎస్ రాజు నగర్ లో కార్యాలయం ఏర్పాటు చేసిన చక్క భాస్కర్ తక్కువ పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు ఇస్తామంటూ వందలాది మంది అమాయకుల వద్ద నుండి చక్క భాస్కర్, అతని భార్య కోట్లాది రూపాయలు వసూలు చేశారు. బ్లీస్ హైట్స్ ప్రాజెక్ట్స్, ఓఆర్ఆర్ హైట్స్ ప్రాజెక్ట్స్, ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ పేరిట పలు చోట్ల వెంచర్లు ఉన్నాయని అమాయకులను నమ్మించింది. తమ ప్రాజెక్ట్స్ ను ఇచ్చిన గడువులోగ పూర్తిచేయకపోతే డబల్ బెడ్ రూమ్ కు రూ.6వేలు, త్రిబుల్ బెడ్ రూమ్ కు రూ.8వేలు ఇస్తామని నమ్మించారు.
అంతేకాకుండా సెలబ్రెటీలతో ప్రచారం చేయించింది ఎంఎస్ఆర్ ఇన్ఫ్రా.. దీంతో వందలాదిమంది అందులో పెట్టుబడులు పెట్టారు. కొంపల్లికి చెందిన వడ్లమూడి మనోజ్ కుమార్ ఎంఎస్ ఆర్ ఇన్ఫ్రా సంస్థలో రూ.65 లక్షల మేర పెట్టుబడులు పెట్టాడు. అయితే లాభాల మాట అంటుంచి పెట్టిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా రేపూమాపూ అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎంఎస్ ఆర్ ఇన్ఫ్రా ప్రతినిధులు అందుబాటులో కూడా లేకుండా పోవడంతో మోసపోయామని తెలుసుకున్న వడ్లమూడి మనోజ్ కుమార్ సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎంఎస్ ఆర్ ఇన్ఫ్రా చైర్మన్ చక్క భాస్కర్, డైరెక్టర్ సుధారాణిలు తక్కువ పెట్టుబడులు పెడితే అధిక లాభాలు అందిస్తామని మాయమాటలు చెప్పి 200 మంది నుంచి రూ.48 కోట్ల మేర వసూళ్లకు పాల్పడ్డారని గుర్తించారు. దీంతో సోమవారం ఎంఎస్ ఆర్ ఇన్ఫ్రా చైర్మన్ చక్క భాస్కర్, డైరెక్టర్ సుధారాణిలను సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు.