- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంతార మూవీ టీంకు యాక్సిడెంట్.. ఆరుగురి పరిస్థితి విషమం
by Bhoopathi Nagaiah |
X
దిశ, వెబ్‌డెస్క్: కాంతార మూవీ టీంకు సంబంధించిన ఓ విషాద వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినిమా షూటింగ్ ముగించుకోని వస్తున్న కాంతార చిత్ర బృందం ప్రయాణిస్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఆర్టిస్టులు తీవ్రగాయాలపాలయ్యారు. PTI పేర్కొన్న కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం జడకల్‌లోని ముదుర్ కాంతార చాప్టర్ 1 షూటింగ్ కొనసాగుతోంది. ఈ రోజు షూటింగ్ పూర్తి కావడంతో 20 మంది జూనియర్ ఆర్టిస్టులు మినీ బస్సులో ముదుర్ నుంచి కొల్లూరుకు తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొందరికి స్వల్పగాయాలు కాగా, ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న కొల్లేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తట్కా జడ్కల్, కుందాపూర్ ఆస్పత్రులకు తరలించారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story