Stalin: సింధూ నాగరికత లిపిని డీకోడింగ్ చేస్తే భారీ గిఫ్ట్.. సీఎం స్టాలిన్‌ కీలక ప్రకటన

by vinod kumar |
Stalin: సింధూ నాగరికత లిపిని డీకోడింగ్ చేస్తే భారీ గిఫ్ట్.. సీఎం స్టాలిన్‌ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఒకటైన సింధు లోయ నాగరికతకు సంబంధించిన లిపి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటిని చదివి అందులో రాసి ఉన్న ఖచ్చితమైన అర్థం చెప్పిన వారికి ఒక మిలియన్ డాలర్ల బహుమతిని అందజేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (Mk stalin) ప్రకటించారు. సింధు నాగరికత ఆవిష్కృతమై వందేళ్లు పూర్తైన సందర్భంగా తమిళనాడులో (Thamilnadu) ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో స్టాలిన్ ప్రసంగించారు. సింధూ నాగరికత ఎంతో గొప్పదని కొనియాడారు. అందులో ఎద్దులు మాత్రమే ఉన్నాయని ఇది ద్రావిడ చిహ్నం అని చెప్పారు. కానీ పండితులు ఆ నాగరికత స్క్రిప్ట్‌ను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు రచనా విధానాన్ని స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 100 ఏళ్లుగా దీనికి సమాధానం దొరకలేదన్నారు. ఇటువంటి ప్రయత్నాలకు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తు్ందని, సింధు నాగరికత డీకోడ్ చేసిన వ్యక్తులు లేదా సంస్థలకు ఒక మిలియన్ డాలర్లు (రూ. 8.57 కోట్లు) బహుమతిగా అందిస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed