Boreddy : నాడు అణిచివేతలు..నేడు ప్రవచనాలు : బోరెడ్డి

by Y. Venkata Narasimha Reddy |
Boreddy : నాడు అణిచివేతలు..నేడు ప్రవచనాలు : బోరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : అధికారంలో ఉన్న రోజుల్లో ప్రతిపక్షాలపైన..ప్రశ్నించిన వారిపైన అధికార దుర్వినియోగంతో చట్ట వ్యతిరేక అణిచివేతలకు పాల్పడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేడు తనదాకా వస్తే ప్రజాస్వామ్య విలువల ప్రవచనాలు వినిపిస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పీఆర్వో బోరెడ్డి అయోధ్యరెడ్డి(Ayodhya Reddy Boreddy) ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. ఫార్ములా ఈ రేసు కేసులో విచారణ ఎదుర్కొంటున్న క్రమంలో తనపై అక్రమ కేసు పెట్టారంటూ కేటీఆర్ ప్రజాస్వామ్య విలువలు వల్లిస్తుండటం విడ్డూరంగా ఉందని బోరెడ్డి విమర్శించారు.

అధికారంలో ఉన్నప్పుడు పాటించని ప్రజాస్వామిక విలువలు..చట్టమూ..న్యాయమూ..ధర్మమూ..తెలంగాణా...అధికారం పోతే ఇవన్నీ కేటీఆర్ కు వర్తమానంలో ప్రవచనాలుగా మారాయని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్టు తీరు, ప్రొఫెసర్ కోదండరాం అరెస్టు తీరు, రేవంత్ రెడ్డి అరెస్టు తీరు మీరు మరిచిపోయరా అని ప్రశ్నించారు. అందుకు సంబంధించిన వీడియోలను బోరెడ్డి ఎక్స్ లో పోస్టు చేశారు.

కేటీఆర్, హరీష్ రావు, కవితలకు ప్రజాస్వామ్య విలువలను బీఆర్ఎస్ పాలనలో ఎలా అణిచివేశారన్నదానిపై గుర్తు చేసేందుకు గత వాస్తవాలు..కొన్ని సంఘటనలు మాత్రమే నేను ఇప్పుడు ప్రస్తావించానని బోరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed