- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొట్లాడైనా కరెంటు ఇప్పిస్తాం
దిశ,బెల్లంపల్లి : సింగరేణి యజమాన్యం నిలిపివేసిన కరెంట్ పునరుద్ధరణ కోసం పోరాటం చేస్తామని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం బెల్లంపల్లిలోని విద్యుత్ సరఫరా నిలిపివేసిన కాలనీలో ఆయన పర్యటించారు. ప్రజలను నేరుగా కలిసి మాట్లాడారు. తమ ఇళ్లకు కరెంటు పోయి ఇబ్బంది పడుతున్నామని ప్రజలు, మహిళలు ఆయనకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజలకు కరెంటు తెప్పిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం హయాంలోనే బెల్లంపల్లిలో కార్మికులు, ప్రజలకు సింగరేణి క్వార్టర్లను సొంతం చేశామని పేర్కొన్నారు.
గతంలో ఇలా కార్మికుల ఇండ్లకు విద్యుత్ కోతలు, కటింగ్లు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే గడ్డం వినోద్ అసమర్ధతే అందుకు కారణమని మండిపడ్డారు. ప్రజలు, కార్మికులు విద్యుత్ కోల్పోయి అంధకారంలో మగ్గుతుంటే అధికార పార్టీలు నాయకులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. సింగరేణితో కొట్లాడైనా బెల్లంపల్లిలో కార్మికుల క్వార్టర్లకు తప్పకుండా కరెంట్ తెప్పిస్తామన్నారు. కరెంటు లేకుండా ప్రజలు, కార్మికులు నరకయాతన పడుతుంటే చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్ నాయకులు సదానందం, రాములు తదితరులు ఉన్నారు.