KTR : ఏసీబీ విచారణకు బయలుదేరిన మాజీ మంత్రి కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
KTR : ఏసీబీ విచారణకు బయలుదేరిన మాజీ మంత్రి కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫార్ములా - ఈ రేస్ కేసు(Formula E Race Case) విచారణ (Investigation)నిమిత్తం తన నందినగర్ నివాసం నుంచి ఏసీబీ(ACB) కార్యాలయానికి చేరుకున్నారు. తన న్యాయవాది రామచందర్ రావుతో విచారణకు హాజరు కానున్నారు. తనతో న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టును కేటీఆర్ కోరగా..దూరం నుంచి చూసే షరతులతో అనుమతించింది.

ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించనున్నట్లుగా సమాచారం. అరవింద్ కుమార్ కూడా నేడు విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా ఈ రేసు కంపనీలు ఎఫ్ఈవో(FEO), ఏసీఈ నెక్స్టు జనరేషన్ (Ace NextGen), హెచ్ఎండీఏ(HMDA)లకు మధ్య జరిగిన తొలి త్రైపాక్షిక ఒప్పందం టైంలో జరిగిన సమాచారాన్ని సేకరించనున్నారు.

చలమలశెట్టి అనిల్, కేటీఆర్ మధ్య సాన్నిహిత్యంపై ఏసీబీ ప్రశ్నించే అవకాశం ఉంది. కేటీఆర్ విచారణపై పొలిటికల్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విచారణ అనంతరం కేసును అరెస్టు చేస్తారా లేదా అన్నదానిపై ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story